Home / తాజా వార్తలు
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. రోగిని త్వరితగతిన ఆసుపత్రికి తరలించే క్రమంలో మితిమీరిన వేగంతో వచ్చిన సదరు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది.
దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ నేతలు నిర్దేశించారు. ఇందులో భాగంగా పల్లె గోస- బీజేపీ భరోసా పేరుతో నేటి నుంచి బైక్ ర్యాలీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీ పై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాలు ఆక్రమించాయి. ప్రస్తుతం కోవిడ్ -19 కంటే ముందు నాటి స్థాయికి పరిస్థితులు వస్తున్నాయి. కాగా కోవిడ్ కంటే ముందు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ల్లో యూరోపియన్ దేశాలు అగ్రస్థానం ఆక్రమించాయి. ఇక జపాన్ పాస్‌పోర్టును తీసుకుంటే ఈ పాస్‌పోర్టు
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎంపికయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైన దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనను ఎన్నుకున్నారు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి.
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో మైలురాయిని సాధించారు. సామాన్య టీచర్‌గా జీవితాన్ని మొదలు పెట్టి తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రసమయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో తనకంటూ గుర్తింపు పొందారు.
ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తి అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో, గత వారం బిల్ గేట్స్ తన సంపదలో $20 బిలియన్లను
ఇంగ్లీష్ మరియు హిందీ తర్వాత, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇండియా టాపిక్స్, కంటెంట్-బేస్డ్ ఫిల్టర్‌ని తమిళంలో ప్రవేశపెట్టింది. ట్విట్టర్ అక్టోబర్ 2020లో భారతీయ వినియోగదారుల కోసం టాపిక్‌లో ఇంగ్లీష్ మరియు హిందీని పరిచయం చేసింది. ఇప్పుడు, తమిళ భాషా వినియోగదారులు ట్విట్టర్ లో ఫిల్మ్ పర్సనాలిటీ,
వర్షాకాలంలో వాతావరణంలో తేమ స్థాయిలు పెరగడం వల్ల జుట్టు మరియు తలపైన చర్మం దెబ్బతింటుంది. ఇది చుండ్రుకు దారి తీస్తుంది. చుండ్రు తలపై తెల్లటి పొలుసులుగా కనిపిస్తుంది. నెత్తిమీద అధిక తేమ ఫంగస్‌కు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది.