Home / తాజా వార్తలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు.
దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రధాని మోడీ తెలిపారు. త్రివర్ణ ప్రతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నామని
పోలియో కారకవైరస్ గుర్తించినట్లు న్యూయార్క్ వైద్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలోని వేస్ట్ వాటర్ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తోందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఈ వైరస్ విస్తరించకముందే న్యూయార్క్
ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లతో పాటు
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్‌హామ్‌లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్‌లను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG)తో విలీనం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ ) దీనికి సంబంధించినిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది.
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.
కుల వివాదం కేసులో ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు కుల పరిశీలన కమిటీ శనివారం క్లీన్ చిట్ ఇచ్చింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని ఆ ఉత్తర్వు చెబుతోంది.అతను మరియు అతని తండ్రి ఇస్లాంలోకి మారినట్లు ఇంకా రుజువు కాలేదని, అయితే, వారు హిందూ మహర్ 37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని రుజువైంది.