Last Updated:

Polio virus: న్యూయార్క్ లో బయటపడ్డ పోలియో వైరస్‌

పోలియో కారకవైరస్‌ గుర్తించినట్లు న్యూయార్క్ వైద్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలోని వేస్ట్‌ వాటర్‌ ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తోందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఈ వైరస్‌ విస్తరించకముందే న్యూయార్క్ 

Polio virus: న్యూయార్క్ లో బయటపడ్డ పోలియో వైరస్‌

New York: పోలియో కారక వైరస్‌ గుర్తించినట్లు న్యూయార్క్ వైద్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలోని వేస్ట్‌ వాటర్‌ ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తోందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఈ వైరస్‌ విస్తరించకముందే న్యూయార్కు నగరంలో ఉండే ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు ప్రజలను కోరారు.

ఎన్‌వైసీ హెల్త్‌ డిపార్టుమెంటుతో పాటు న్యూయార్క్ స్టేట్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ న్యూయార్క్ నగరంలోని సీవరేజ్‌లో పోలియో వైరస్‌ను గుర్తించినట్లు పేర్కొంది. ఈ వైరస్‌ శరవేగంగా విస్తరించవచ్చునని ప్రజలను హెచ్చరించింది. పోలియో వల్ల పక్షవాతంతో పాటు మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. న్యూయార్కులోని ప్రతి ఒక్కరు వెంటనే వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని కోరింది. ఈ ఏడాది రాక్‌లాండ్‌లో గత నెల 21వ తేదీన మొదటిసారి పోలియోను గుర్తించారు. పదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి అమెరికాలో పోలియో బయట పడింది.

ఇవి కూడా చదవండి: