Last Updated:

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న హెల్త్ అప్‌డేట్… కుప్పం నుంచి బెంగుళూరుకి తరలింపు

నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న హెల్త్ అప్‌డేట్… కుప్పం నుంచి బెంగుళూరుకి తరలింపు

Nandamuri Taraka Ratna : నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు.

నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

బాలకృష్ణ తన వాహనంలో బెంగుళూరుకు ముందు వెళ్లగా.. అంబులెన్స్ లో తారకరత్నను వెనుక తీసుకెళ్లారు.

ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ తెలుసుకుంటున్నారు.

కాగా ముందుగా తారక రత్న నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి అత్యాధునిక సదుపాయాలు ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ను కుప్పం రప్పించారు.

ఆ అంబులెన్స్ లో ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించే విధంగా ఏర్పాటు చేశారు.

బెంగుళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకరావడంతో కుప్పం పీఈసీ ఆస్పత్రిలోనే నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు చికిత్స కొనసాగించారు.

ఆ తర్వాత ఆర్ధరాత్రి సమయంలో తారకరత్నను తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది.

 

కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. టీడీపీ నాయకులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి వచ్చేటప్పటికే పల్స్ లేకపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు.

హార్ట్ కు ఎడమవైపు బ్లాక్స్ బ్లడ్ సప్లై అయి నరం 90 బ్లాక్ కావడంతో గుండె పోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

తారకరత్నకు ఆంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఒక స్టెంట్ కూడా అమర్చారు.

ఉదయం నుంచి బాలకృష్ణతో ఇతర టీడీపీ నేతలు ఆస్పత్రిలో ఉండి తారకరత్నకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించారు.

చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు డాక్టర్లు, బాలకృష్ణతో మాట్లాడుతూ హెల్త్ అప్ డేట్ ను అడిగి తెలుసుకున్నారు.

 

మరోవైపు నిన్న రాత్రి సమయంలో తారకరత్నను ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిషిక చూసి బాగా ఎమోషనల్ అయ్యారు.

వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలయ్య తారకరత్న హెల్త్ కండీషన్ ను వారికి వివరించారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారిద్దరికీ ధైర్యం చెప్పారు బాలయ్య.

జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్యకు ఫోన్ చేసి.. అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు.

పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటలకు లోకేశ్‌ ఆసుపత్రికి వెళ్లి..  వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

తారకరత్న గుండెలో ఎడమ వైపు వాల్ 90 శాతం బ్లాక్ అయిందని, మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించాలని కుప్పంలోని పీఈసీ ఆస్పత్రి వైద్యులు మొదట సూచించారు.

ఈ మేరకు ఆయనను అక్కడికి షిఫ్ట్ చేశారు.

మరికాసేపట్లోనే హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/