Last Updated:

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు.

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

Nagababu : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు. ఈ మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు.

ఈ సభలో ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు. కాగా ఈ సభలో మాట్లాడుతూ.. యువశక్తి సభపై విమర్శలు చేస్తున్న వైసేపీ నేతలపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్ధాయిలో రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతలకు పనీ పాట లేదన్నారు. రాజకీయ విమర్శలు తప్పా వైసీపీ నేతలకు పాలన చేతకాదన్నారు.

ఆడే విధంగా తక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తున్నారని.. యువత రాకపోతే రాజకీయాల్లోకి దుర్మార్గులు వస్తారని జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. జనసేన యువతకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘‘వైకాపా ఒక నియంతలా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్‌ వారాహిని అడ్డుకోవడమే వారి లక్ష్యం. వైకాపా పతనాన్ని త్వరలోనే కళ్లారా చూస్తాం’’ అని నాగబాబు పేర్కొన్నారు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటల మయం, ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనబడుతుంది. చెప్పిన పని చేసేవారే ఆ కుటుంబాలకు దగ్గరగా మసల గలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం తమకు అనుకూలం కావాలని కోరుకుంటారు. అందువల్లే వారికి బాబాయి హత్య తప్పుగా కనిపించడంలేదు. అడ్డం వచ్చిన వారిని అడ్డు తొలగిస్తే నేరం ఎలా అవుతుందని వారు భావించడం  వారికి పని అని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

ఇవి కూడా చదవండి..

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

Nagababu: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు.. నాగబాబు కామెంట్స్ వైరల్

Veera Simha Reddy: జై బాలయ్య.. తాతకు పూనకం వచ్చేసింది

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: