Last Updated:

New DGP Of AP: ఏపీ డీజీపీగా హరీష్ గుప్తా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

New DGP Of AP: ఏపీ డీజీపీగా హరీష్ గుప్తా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Harish Kumar Gupta Appointed As New DGP Of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఇక, డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం.. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కానీ హరీష్ కుమార్ గుప్తాని ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఎన్నికల సంఘం డీజీపీగా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ ఆరోపణల నేపథ్యంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసి, ఆయన స్థానంలో హరీష్‌ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్‌ల పేర్లను నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీకి సూచించగా, ఈసీ హరీష్‌ను ఎంపిక చేసింది. హరీష్‌ కుమార్‌ జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తి కాగా.. ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ఎన్నికల తర్వాత డీజీపీగా తిరుమలరావును ప్రభుత్వం నియమించగా, ఆయన పదవీ విరమణతో ప్రభుత్వం తాజాగా హరీష్‌ను డీజీపీగా ఎంపిక చేసింది.