Last Updated:

Power Star Pavan Kalyan: హరిహర వీరమల్లు మూవీ అప్డేట్.. పవన్ కల్యాణ్ పాడిన పాట ఇదే!

Power Star Pavan Kalyan: హరిహర వీరమల్లు మూవీ అప్డేట్.. పవన్ కల్యాణ్ పాడిన పాట ఇదే!

Power Star Pavan Kalyan Hari Hara Veera Mallu Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను తొలుత క్రిష్, తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక, ఈ సినిమా పార్ట్ 1 కి సంబంధించి చివరి దశకు చేరుకుంది. తాజాగా, న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం మూవీ మేకర్స అదిరిపోయే అప్డేట్ ప్రకటించారు.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడినట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 9.06 నిమిషాలకు పవన్ కల్యాణ్ పాడిన తొలి పాట ‘మాట వినాలి’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాట స్వయంగా పవన్ కల్యాణ్ పాడగా.. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా తొలి భాగానికి స్వార్డ్ వెర్సస్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఇందులో పవన్ కల్యాణ్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే ఓ యూధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నోరాహి, నిధి అగర్వాల్, విక్రమ్ జిత్, జిషు సేన్ కీలక పాత్రలో నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ తాను నటించిన చాలా సినిమాల్లో పాటలను స్వయంగా పాడారు. తమ్ముడు సినిమాలో పాడిన ‘తాటి చెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు దింపలేవు’అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. అలాగే ఖుషి సినిమాలో బై బయ్యే బంగారు రమణమ్మ.. జానీ సినిమాలో నువ్వు సారా తాగుడు మానురన్నో.. గుడుంబా శంకర్ సినిమాలో కిల్లీ కిల్లీ కిల్లీ నమిలాక బాగున్నదే.. అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమ రాయుడా కదిరి నరసింహుడా.. అజ్ఞాతవాసి మూవీలో కొడకా కోటేశ్వరరావు కరుసైపోతువురో వంటి సాంగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. తాజాగా, హరి హర వీరమల్లు సినిమాలో పాడిన ‘మాట వినాలి’ సాంగ్ ఎంత ఫేమస్ అవుతుందో చూడాలి మరి.