Last Updated:

Exit polls : గుజరాత్, హిమాచల్ లో బీజేపీ.. ఢిల్లీ మున్పిపల్ ఎన్నికల్లో ఆప్ .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.

Exit polls :  గుజరాత్, హిమాచల్ లో బీజేపీ.. ఢిల్లీ మున్పిపల్ ఎన్నికల్లో ఆప్ .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

Gujarat Exit polls: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం గుజరాత్‌లోని 182 సీట్లలో బీజేపీకి 131, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు 41 వస్తాయి. ఇక్కడ ఆప్ చెప్పకోదగ్గ  ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. రిపబ్లిక్  టీవీ-పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారం సాధిస్తుందని అంచనా వేసింది.

అక్కడ బీజేపీ 34-39, కాంగ్రెస్ 28-33, ఆప్ 0-1, ఇతరులు 1-4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 44.8 శాతం, కాంగ్రెస్ 42.9 శాతం, ఆప్ 2.8 శాతం, ఇతరులు 9.5 శాతం ఓట్లు సాధిస్తాయని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 68 స్థానాలు ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 35 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటినట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 149 నుంచి 171 వార్డులను గెలుచుకోబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రెండో స్థానంలో బీజేపీ నిలవనున్నట్టు తెలుస్తున్నది. ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ 149 వార్డుల నుంచి 171 వార్డుల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నది. కాగా, బీజేపీ 69 వార్డుల నుంచి 91 వార్డుల వరకు గెలుచుకోబోతున్నది.టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 146 వార్డుల నుంచి 156 వార్డుల వరకు ఆప్ కైవసం చేసుకుంటుంది. బీజేపీ 84 వార్డుల నుంచి 94 వార్డుల వరకు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: