Last Updated:

Modi Swearing-in Cermoney: ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారానికి రంగం సిద్దం

నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ముమోదీతో పాటు ఆయన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Modi Swearing-in Cermoney:  ప్రధానిగా నరేంద్రమోదీ  ప్రమాణస్వీకారానికి రంగం సిద్దం

Modi Swearing-in Cermoney: నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ముమోదీతో పాటు ఆయన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నాయకులతో పాటు మొత్తం 8,000 మంది అతిథులను ఆహ్వానించారు. రాష్ర్టపతి భవన్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాగా శుక్రవారం నాడు నరేంద్రమోదీని తమ నాయకుడిగా బీజేపీ ఎన్నుకుంది. అటు తర్వాత ఎన్‌డీఏ కూటమికి కూడా మద్దతు తెలుపుతూ లేఖ అందజేసింది. ఈ లేఖలు రాష్ర్టపతికి సమర్పించడం జరిగింది. కాగా రాష్ట్రపతి  ద్రౌపది ముర్మ మోదీని ప్రధానమంత్రిగా అపాయింట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి భవన్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి పలు అంచెల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు కంపెనీల పారామిలిటరీ దళాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లు దించారు. న్యూఢిల్లిని నో ఫ్లయి జోన్‌గా ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు నో ఫ్లయి జోన్‌ కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారత శిక్షాస్మృతి 188 సెక్షన్‌ కింద శిక్షిస్తారు. విదేశీ అతిథులు నివసించే టాప్‌ హోటల్స్‌ ఉదాహరణకు హోటల్‌ లీలా, తాజ్‌, ఐటిసీ మౌర్య, క్లాడ్‌రిడ్జ్‌, ఒబెరాయ్‌ వద్ద పటిష్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లు మూసివేయడంతోపాటు ట్రాఫిక్‌ డైవర్ట్‌ చేశారు.

ఏడుదేశాల అధ్యక్షులు..(Modi Swearing-in Cermoney)

మాల్దీవ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ ముయిజ్జు మోదీ ప్రమాణ స్వీకారాన్ని అంగీకరించి ఆదివారం వస్తున్నారు. ఆయనతో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌, సీషెల్స్‌ దేశానికి చెందిన ప్రెసిడెంట్లు, లేదా ప్రధానమంత్రులు హాజరవుతారు. ఇక మోదీ మంత్రివర్గం విషయానికి వస్తే ఆయనతో పాటు 27 నుంచి 30 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో మిత్రపక్షాలకు చెందిన వారు కూడా ఉంటారని వినికిడి. అయితే మిత్రపక్షాలతో కేబినెట్‌ బెర్తుల కోసం రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, జెపీ నడ్డాలు రాయబారాలు నడిపారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతు దారులు అమెరికాలోని 22 నగరాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నారు. న్యూయార్కు, జెర్సీ సిటి, వాషింగ్టన్‌ డీసీ, బాస్టన్‌, టాంపా, అట్లాంటా, హ్యుస్టన్‌, డల్లాస్‌, షికాగో, లాస్‌ఎంజిలెస్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలు వచ్చే రెండు వారాంతాల్లో ఈ సంబరాలు జరుగుతాయి. ప్రవాస భారతీయులు ఈ సంబరాల్లో పెద్దెత్తున పాల్గొంటారు. కాగా మొదటి పార్లమెంటు సమావేశం ఈ నెల 15న జరుగనుంది. కొత్త ఎంపికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు కొత్త స్పీకర్‌ను కూడా ఎన్నకుంటారు. జూన్‌ 22న ప్రారంభ సమావేశాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి: