Last Updated:

Green Tea Benefits: గ్రీన్ టీ తో ప్రయోజనాలు ఎన్నో..

ఇటీవలకాలంలో గ్రీన్ టీ మీద ప్రజలకు అవగాహన పెరిగింది. రోజూ తాగే టీకి ప్రత్యామ్నాయంగా దీనిపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల వల్లే దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ టీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి.

Green Tea Benefits: గ్రీన్ టీ తో ప్రయోజనాలు ఎన్నో..

Green Tea Benefits: ఇటీవలకాలంలో గ్రీన్ టీ మీద ప్రజలకు అవగాహన పెరిగింది. రోజూ తాగే టీకి ప్రత్యామ్నాయంగా దీనిపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల వల్లే దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ టీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి.

క్రమం తప్పకుండా రోజూ కనీసం రెండు కప్పుల గ్రీన్‌ టీ తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును తగ్గించడానికి గ్రీన్ టీ పనిచేస్తుంది. ఒబేసిటీకి అద్భుత ఔషధంగా ఉపకరిస్తుంది. గ్రీన్ టీలో బయో యాక్టివ్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. సహజమైన యాంటీయాక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి .కణాలు దెబ్బతినడాన్ని ఇది నివారిస్తుంది. సెల్స్ అండ్ మాలిక్యూల్స్ డ్యామేజీ లేకుండా దోహదపడుతుంది. అనేక రకాల వ్యాధులను నివారించడానికి అత్యవసరమైన గుణాలు గ్రీన్ టీలో ఉన్నట్లు శాస్త్రీయబద్ధంగా నిర్ధారించారు. గ్రీన్ టీ ఎల్-థియానైన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడు చురుకుగా పనిచేయడానికి దోహద పడుతుంది. రక్త ప్రసరణ సజావుగా సాగేలా ఇది ఉపకరిస్తుంది. ఎల్-థియానైన్ యాసిడ్ యాంటీ యాంగ్జయిటీగా పని చేస్తుంది.

కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుంది. మెటబాలిక్ రేటును ఇది మరింత పెంచుతుంది. కేన్సర్ వంటివి దరి చేరనివ్వకుండా చేయగలుగుతంది. యాక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కేన్సర్‌కు ప్రధాన కారణం. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడటానికీ యాక్సిడేటివ్ డ్యామేజీ కారణమౌతుంది. దీన్ని నివారించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమౌతాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ అనేవి గ్రీన్ టీలో అత్యధికంగా ఉంటాయి. గ్రీన్ టీ అనేది అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టెట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి దుష్ప్రభావాన్ని 40 శాతం వరకు గ్రీన్ టీ తగ్గించినట్లు నిర్ధారించారు. ఒక వయస్సు దాటిన తరువాత ఏర్పడే అల్జీమర్స్‌ను కూడా నివారించే శక్తిసామర్థ్యాలు గ్రీన్ టీలో ఉన్నాయి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాటెచిన్ జ్ఞాపక శక్తిని పెంపొందించుతాయి. గ్రీన్ టీ అల్జీమర్స్ దరి చేరకుండా నివారించగలుగుతుంది. గ్రీన్ టీ టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఫాస్టింగ్ బ్లడ్ లో గ్లూకోజ్‌ని గణనీయంగా తగ్గిస్తుందని చూపించాయి.

ఇవి కూడా చదవండి: