Home / అంతర్జాతీయం
ఐస్ క్రీమ్ అంటేనే నోరూరిపోతుంటుంది కదా. బయట భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడిలో ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరేమో.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా లోని టెక్సాస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ నగరంలోని బ్రౌన్స్‌విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దక్షిణ పెరూలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు సమాచారం అందించారు.
:ప్రస్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని డల్లాస్ శివారులోని అలెన్లోనిమాల్లో ఒక సాయుధుడు కనీసం తొమ్మిది మందిని కాల్చిచంపాడు. మాల్‌ను కలిగి ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్ ప్రతినిధి కీత్ సెల్ఫ్ మాట్లాడుతూ ఎదురుదాడిలో కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని చెప్పారు.
సియెన్నా వీర్‌కు చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ అంటే ఎక్కువ ఇష్టం. హార్స్ రైడింగ్ తన జీవితంలో భాగమని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది.
King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ.