Home / అంతర్జాతీయం
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్‌తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
నేపాల్‌లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు పడటంతో 14 మంది మరణించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఎంఎ) ప్రకారం, కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు మరియు వరదల కారణంగా ఒకరు మరణించారు.
కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం తర్వాత బుధవారం తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు, గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది
బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో 15 మందికి పైగా పోలీసు అధికారులు, మతగురువుతో సహా పలువురు పౌరులు సాయుధ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. ముష్కరులు రెండు నగరాల్లోని రెండు చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
చైనా దాదాగిరి రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా సమయంలో భారత్ సరిహద్దులోని గల్వాన్ లోయలో అక్రమ కట్టడాలు కట్టడాన్ని ఇండియా వ్యతిరేకించడంతో మొదలైన బాహాబాహీలో ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు.
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచింది హిందూజా కుటుంబం. ఇండియాకు చెందిన వీరు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి వ్యాపారాలున్నాయి. అయితే ఇటీవల హిందూజా గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.