Home / అంతర్జాతీయం
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.
ఇజ్రాయెల్ సైన్యం తమభూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలు హమాస్ ప్రభుత్వ కేంద్రాలకు నిలయమైన గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి.
ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతికి ఎంపిక చేసింది.
ఇజ్రాయెల్ ,పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. గాజాలో సుమారుగా 413 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపం మృతుల సంఖ్య 2,400 కు పైగా దాటిందని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ తెలిపారు. ఈ భూకంపం కారణంగా సుమారుగా 2,445 మంది మరణించారని, 1,320 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. హెరాత్‌లోని జిందా జన్ జిల్లాలోని 13 గ్రామాలలో భూకంప బాధితులు ఎక్కువగా ఉన్నారని సైక్ తెలిపా
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్దంలో రెండింటిలోనూ సుమారు 500 మందికి పైగా మరణించారు. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 300 మందికి పైగా మరణించారు.
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, బలమైన ప్రకంపనల కారణంగా 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. రెండు దశాబ్దాల్లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో ఇది ఒకటి.
ఇజ్రాయెల్ లో ప్రస్తుతం భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ మహిళ నర్గీస్ మహ్మదీ దక్కించుకున్నారు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న నర్గీస్ ఇరాన్లో అణిచివేయబడుతున్న మహిళలకు తరపున మానవ హక్కులకోసం.. ప్రతి ఒక్కరికి స్వేచ్చ కోసం ఆమె పోరాడుతున్నారు.
సిరియాలోని మిలిటరీ అకాడమీపై గురువారం జరిగిన డ్రోన్ల దాడిలో సుమారుగా 100 మందికి పైగా మరణించారు. సిరియా రక్షణ మంత్రి గ్రాడ్యుయేషన్ వేడుక నుండి బయలుదేరిన కొన్నినిమిషాల తర్వాత ఆయుధాలతో కూడిన డ్రోన్లు బాంబుదాడికి దిగాయని అధికారులు తెలిపారు.