Last Updated:

Sri Lanka cricket Board: భారత్‌తో ఘోర పరాజయం .. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు..

ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.

Sri Lanka  cricket Board: భారత్‌తో ఘోర పరాజయం ..  శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు..

Sri Lanka cricket Board: ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.

దీరితో శ్రీలంక క్రికెట్ కార్యదర్శి, సంస్థలో రెండవ అత్యున్నత పదవిలో ఉన్న మోహన్ డి సిల్వా, బోర్డు ప్రధాన కార్యాలయం వెలుపల అభిమానుల నిరసనల మధ్య రాజీనామా చేశారు. ప్రపంచ కప్ లో ఏడు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వారి రికార్డులో రెండు విజయాలు మరియు ఐదు పరాజయాలు ఉన్నాయి. శ్రీలంక కనీసం నాల్గవ స్థానంలో స్థానం సంపాదించాలంటే, వారు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవవలసి ఉంటుంది.

తాత్కాలిక చైర్మన్ గా అర్జున రణతుంగ..(Sri Lanka cricket Board)

1996లో శ్రీలంక క్రికెట్ జట్టుకు ఏకైక ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన అర్జున రణతుంగను బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించినట్లు రణసింగ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఏడుగురు సభ్యుల కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మరియు మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నారు.