Last Updated:

Rahkeem Cornwall: టీ 20 క్రికెట్ చరిత్రలో రికార్డు.. డబల్ సెంచురీ నమోదు

వన్ డే క్రికెట్ లో డబల్ సెంచురీ అందరికి తెలిసిందే. టీ 20 క్రికెట్ లో కూడా సాధ్యమేనని నిరూపించాడు ఓ యువ ఆటగాడు. అతనే వెస్టిండీస్ చిచ్చర పిడుగు రకీం కార్నవాల్. అమెరికా వేదికగా టీ 20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఓపెన్ లో ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కార్నవాల్ ఆటలో చెలరేగాడు.

Rahkeem Cornwall: టీ 20 క్రికెట్ చరిత్రలో రికార్డు.. డబల్ సెంచురీ నమోదు

Rahkeem Cornwall: వన్ డే క్రికెట్ లో డబల్ సెంచురీ అందరికి తెలిసిందే. టీ 20 క్రికెట్ లో కూడా సాధ్యమేనని నిరూపించాడు ఓ యువ ఆటగాడు. అతనే వెస్టిండీస్ చిచ్చర పిడుగు రకీం కార్నవాల్. అమెరికా వేదికగా టీ 20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఓపెన్ లో ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కార్నవాల్ ఆటలో చెలరేగాడు.

స్క్వేర్ డ్రైవ్ జట్టుతో ఆడిన సమయంలో 22 సిక్స్ లు, 17 ఫోర్లతో 205 పరుగులు సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 77 బంతుల్లో డబల్ సెంచురీ సాధించిన ఘనతను కార్నెల్ తన ఖాతాలో వేసుకొన్నాడు. 266.23 స్ట్రైక్ రేటుగా నమోదు చేసుకొన్నాడు. దీంతో స్క్వేర్ డ్రైవ్ జట్టుపై అట్లాంటా ఫైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది.

కుడిచేతి వాటం, ఆల్-రౌండర్ అయిన రకీం కార్నవాల్ తన జట్టు కోసం మైదానంలో కీలక స్కోర్ సాధించాడు. 29ఏళ్ల యువ క్రికెటర్ ఇప్పటి వరకు 9 టెస్ట్ మ్యాచులను ఆడాడు. తాజాగా టీ 20 లీగ్ లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ను తన సొంతం చేసుకొన్నాడు.

ఇది కూడా చదవండి: నేడు తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత్‌

ఇవి కూడా చదవండి: