Home / అంతర్జాతీయం
ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ల భేటీ ఖరారైంది. నవంబర్ లో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరగనున్న జీ-20 లీడర్షిప్ సమ్మిట్‌లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపిన్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వార తెలియచేసింది.
ట్విట్టర్‌ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను ఎట్టకేలకు సొంతచేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల అనంతరం డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అయితే ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరాగానే మస్క్ తనను తప్పుదారి పట్టించాడని ఆరోపించిన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను మరియు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను బాధ్యతల నుంచి తప్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం సురక్షితమైంది, ఏ ఏ దేశాల్లో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుపుతూ గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ ను విడుదల చేసింది. జాబితాలో 96 పాయింట్లు సాధిస్తూ సింగపూర్ తొలి స్థానంలో నిలబడింది. భారత దేశం 80 పాయింట్ల సాధించి 60వ ర్యాంకులో నిలిచింది.
బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా జరుపుకుంటున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నిజమైన ప్రపంచ ఇంధన సంక్షోభం" మధ్యలో ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (IEA) హెచ్చరించింది.
అందరిలాగే క్రైస్తవ సన్యాసినులు మరియు పూజారులు కూడా ఆన్లైన్లో అశ్లీల కంటెంట్‌ను చూస్తారని పోప్ ఫ్రాన్సిస్ వాటికన్లో జరిగిన ఒక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఆవిర్బవించాడు. జిన్ పింగ్ మావో జెడాంగ్ తర్వాత చైనా యొక్క అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.