Hero Sriram: డ్రగ్స్ కేసు..ప్టార్ హీరో శ్రీరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Hero Sriram in Drugs Case: చెన్నై డ్రగ్స్ కేసులో స్టార్ హీరో శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రాంతానికి చెందిన శ్రీరామ్.. ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో ఉంటున్నాడు. అయితే ఇటీవల ఆయన మాజీ డీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను విచారణ నిమిత్తం చెన్నైలో విచారించారు.
ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిని విచారణ చేస్తుండగా.. వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను నుంగంబాకం పోలీసులు దాదాపుగా 2 గంటల పాటు విచారించారు. అనంతరం శ్రీరామ్ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఆయనకు రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డ్రగ్స్ కేసులో అతని పేరు రాగానే ఇండస్ట్రీకి షాక్ కు గురైంది.
ఇదిలా ఉండగా, శ్రీరామ్ తెలుగుతో పాటు తమిళం సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరికి ఒకరు, స్నేహితుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఈటీవీ విన్ ఓటీటీలో వళరి మూవీలోనే శ్రీరామ్ యాక్ట్ చేశాడు. లేటెస్ట్ గా ఎర్రచీర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.