Last Updated:

Mind and Mood: ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడికి దూరంగా..

నిద్ర లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం. ఇళ్లు, ఆఫీస్ అంటూ తీరిక లేకుండా పని చేసే ఒత్తిడి లైఫ్ స్టైల్ లో భాగమైంది.

Mind and Mood: ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడికి దూరంగా..

Mind and Mood: నిద్ర లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం. ఇళ్లు, ఆఫీస్ అంటూ తీరిక లేకుండా పని చేసే ఒత్తిడి లైఫ్ స్టైల్ లో భాగమైంది.

ఈ క్రమంలో కొంత మందికి కోపం, ఆందోళన ఎక్కువగా వస్తుంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. అందుకే ఒత్తిడిని ఒక లిమిట్ లోనే ఉంచుకోవాలి.

మరి ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలా పద్దతులు ఉన్నాయి. అయితే కొంత మందికి శరీరంలో జరిగే మార్పుల వల్ల ఒత్తిడి వస్తుంది.

కాబట్టి దేని గురించి ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టు ఒత్తిడి తగ్గించే మార్గాలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

 

ప్రశాంతత కోసం..

– రోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం అలవాటు చేసుకోండి. అంత టైం కూడా లేదంటారా? కనీసం కళ్లు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి.

– గంటల సేపు ఒకేచోట కూర్చున్నపుడు మెదడు అలిసిపోయినట్టుగా అయి ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి మధ్యమధ్యలో లేచి కాసేపు నడిస్తే రిలాక్స్ అవుతారు.

కనీసం నాలుగు అడుగులు వేసినా సరే ఒకింత ఉపశమనం కలుగుతుంది.

– మొక్కలు, గ్రీనరీ మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వీలున్నపుడు మొక్కల మధ్య ఉండటానికి ప్రయత్నించండి.

– ఒత్తిడి ఎక్కువ అయినపుడు కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు. దాని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఒత్తిడిలో ఉన్నా.. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి.

అపుడే ఒత్తిడిని కంట్రోలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.

– ఒత్తిడి తక్కించుకోవడానికి ఇంకో బెస్ట్ ఆప్షన్ డ్రాయింగ్. బాగా ఒత్తిడి అనిపించినపుడు ఒక పేపర్ తీసుకుని మంచి బొమ్మలు వేసి వాటికి మంచులు రంగులు వేయండి.

బొమ్మలు వేసేటపుడు క్రియేటివిటీ బయటకు వస్తుంది. వేసే బొమ్మలపైన దృష్టి పెట్టినపుడు మనసు తేలిక పడుతుంది.

– బాగా నచ్చిన సినిమాలు, ఇపుడైతే వెబ్ సిరీసులు చూస్తూ కూడా ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

అపుడప్పుడు అవుడోర్ గేమ్స్ క్రికెట్, ఫుట్ బాల్ లాంటివి ఆడితే మనససూ, శరీరం రెండూ రిలాక్స్ అయిపోతాయి.

– చాలామందికి ఒత్తిడి ని తగ్గించే మార్గం మ్యూజిక్. మూడ్ బాగాలేదనిపిస్తే నచ్చిన పాటలు పెట్టుకుని వినండి.

అదేవిధంగా చాలామంది వర్క్ లో ఉన్నపుడు అలసట అనిపించి చిరాకుగా ఉంటారు. అలాంటపుడు ఒక పది నిమిషాలు కళ్లు మూసుకుని రిలాక్స్ అయితే ఆందోళనను తగ్గించుకోవచ్చు.

– ఒత్తిడి తో ఉన్నప్పుడు నచ్చిన ఫుడ్ ను తిని రిలాక్స్ అవ్వొచ్చు. కానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. గుప్పెడు నట్స్, బాయిల్డ్ ఎగ్, సగం అవకాడో.. ఇవన్నీ హెల్దీ ఆప్షన్సే కదా.

అయితే, ఆఫీసులో ఉంటే కంప్యూటర్ నుంచి, ఇంట్లో ఉంటే టీవీ నుంచి పక్కకి వెళ్ళి తినండి. మీరు తింటున్న స్నాక్ ని ఎంజాయ్ చేయండి.

Music therapy reduces depression young people, Queen's University Belfast finds | Express.co.uk
పోషకాలను చూసుకోండి

కొంత మంది డైట్ అంటూ ప్రతిదీ కొలిచి మరీ తింటారు. అవి కూడా కొన్ని పదార్థాలనే. అలాంటి వారిలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి శరీరంలో పోషకాలు తగ్గాయేమో చూసుకోవాలంటున్నారు నిపుణులు. మెగ్నీషియం, జింక్, విటమిన్లు డి,సి,బీ12 ల స్థాయి ఎలా ఉందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా ఆహారంలో మార్పులు

చేసుకోవాలి.

శరీరంలో మెగ్నీషియం తగ్గినపుడ నిద్ర తో పాటు శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

కాబట్టి ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, నట్స్ , విత్తనాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.

నరాల పనితీరులో జింక్ ది ప్రధాన పాత్ర. ఇది ఏమాత్రం తగ్గినా డిప్రెషన్, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం, మతిమరుపు లాంటివి కలుగుతాయి.

వాటిని అధిగమించాలంటే గుడ్లు, పుట్టగొడుగులు, పెరుగు, చిక్కుడు వంటివి ఎక్కువగా తీసుకుంటే జింక్ లోపముండదు.

విటమిన్ డి లోపం ఉంటే శరీరంలోన ప్రతిదానిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.

What Fruit Has the Most Vitamin C?

రోజూ ఉదయాన్నే కొద్దిసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లోపముండదు. మరీ అవసరం అయితే డాక్టర్ల సూచనతో సప్లిమెంట్లను వాడొచ్చు.

శరీరంలో విటమిన్ సి తగ్గితే డొపమైన్ స్థాయిలూ తగ్గుతాయి. దాంతో మనసు బాగోకపోవడం, ఒత్తిడి పెరగడం జరుగుతుంది.

కాబట్టి సి విటమిన్ ఉండే నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లతో పాటు క్యాబేజీ, క్యాలిఫ్లవర్ , ముల్లింగి, బ్రొకెలీ ల లో కూడా ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/