Heart Attack: ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Heart Attack: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారనే వార్తలు మీరు వినే ఉంటారు. నిజానికి.. కోవిడ్ నుండి మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా గుండెపోటు కేసుల సంఖ్య పెరిగింది. ఈ రోజుల్లో గుండెపోటు ఎటువంటి లక్షణాలు లేదా ఎటువంటి ఇబ్బంది లేకుండా అకస్మాత్తుగానే వస్తోంది. అంతే కాకుండా ఉన్నట్టుండి జనాలు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలుతున్నారు. గతంలో గుండెపోటు ఒక నిర్దిష్ట వయస్సు ఉన్నవ్యక్తులకు మాత్రమే వచ్చేది.. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ సమస్య చిన్న వయస్సు వారిలో మరింత తీవ్రమవుతోంది.
గుండెపోటు:
ఇప్పుడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ గుండెపోటు వస్తోంది. మనకు గుండెపోటు రాబోతోందని ఎలా తెలుస్తుంది ? అంటే చాలా మందికి ఇందుకు సమాధానం తెలియదు.
గుండెపోటుకు అథెరోస్క్లెరోసిస్ ఒక ప్రధాన కారణం:
ఈ రోజుల్లో.. చాలా మందికి గుండెపోటు అథెరోస్క్లెరోసిస్ వల్ల వస్తున్నాయి. నిజానికి, అథెరో అంటే కొవ్వు , స్క్లెరోసిస్ అంటే పేరుకుపోవడం. అంటే గుండె దగ్గర అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తరచుగా జరిగేది ఏమిటంటే ధమనులలో మూసుకుపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
ఫలితంగా.. ఆ వ్యక్తికి గుండెపోటు వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ నూనె పదార్థాలు తినడానికి చాలా మంది ఇష్టపడుతన్నారు. ఇది శరీరంలో కొవ్వును పెంచుతుంది. అంతే కాకుండా అథెరోస్క్లెరోసిస్ సమస్యను పెంచుతుతుంది.
ఒక పరిశోధన ప్రకారం.. మీకు అథెరోస్క్లెరోసిస్ ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం 8 రెట్లు పెరుగుతుంది. డానిష్ సంస్థ అయిన నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఈ స్థితిలో ధమనులు చాలా నెమ్మదిగా మూసుకుపోతాయి. దీని కారణంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి లక్షణాలు కూడా తెలియవు. ఈ బలహీనమైన రక్త ప్రవాహం కారణంగా.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు రోజుూ చేసే పని కంటే కాస్త ఎక్కువ పని చేసినప్పుడు గుండెపోటు వస్తుంది.
హెచ్చరిక లేకుండానే..
కాలేయంలో అథెరోస్క్లెరోసిస్ సంభవిస్తే దానిని కాలేయ వైఫల్యం అంటార. అదే వ్యాధి మూత్రపిండంలో సంభవిస్తే దానిని మూత్రపిండ వైఫల్యం అంటారు. ఈ వ్యాధి గురించి భయంకరమైన విషయం ఏమిటంటే దాని లక్షణాలు త్వరగా కనిపించవు. సమస్య చాలా తీవ్రమయ్యే వరకు మీ శరీరం సాధారణంగా పనిచేస్తూనే ఉంటుంది. వ్యాధి తీవ్రమైతే మీరు దానిని ఏ విధంగానూ నయం చేయలేరు. అందుకే మీరు నడుస్తున్నప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తే.. ఎప్పటికప్పుడు శరీరాన్ని పూర్తిగా టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తారు.
అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక ప్రసిద్ధ వ్యాసం.. ప్రకారం అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ఏ వ్యక్తిలోనైనా చాలా చిన్న వయస్సులోనే అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుందని వెల్లడించింది. కానీ దాని లక్షణాలు ఎక్కువ కాలం కనిపించవు. గుండెపోటు సంబంధిత పరీక్షల సమయంలో ఈ వ్యాధి గుర్తించబడుతుంది. డెన్మార్క్‌లో, 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సుమారు 9000 మందిపై ఒక సర్వే నిర్వహించబడింది. ముందుగా ఈ వ్యక్తులు ఎటువంటి గుండె జబ్బులతో బాధపడలేదు. వారికి గుండెపోటు వస్తుందా లేదా అని తెలుసుకోవడమే ఈ సర్వే ఉద్దేశ్యం. దాదాపు 46 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేకుండానే అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ఉందని, వారికి సకాలంలో చికిత్స చేయకపోతే.. ఈ 46 శాతం మందికి ఎప్పుడైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
గుండెపోటును నివారించడానికి కొన్ని మార్గాలు:
కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు , చక్కెర ఉన్న ఆహార పదార్థాల వాడకాన్ని తగ్గించండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
మీ శరీర బరువును మీ శరీరానికి అనుగుణంగా ఉంచుకోండి. ఎక్కువగా పెరగనివ్వకండి.
మీరు డయాబెటిక్ రోగి అయితే.. మీ రక్తంలో చక్కెర స్థాయిని తక్కువగా ఉంచుకోండి. అంతే కాకుండా మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండండి.
నడుస్తున్నప్పుడు ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా కాళ్ళు లేదా చేతుల్లో నొప్పిగా అనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.