Benefits of Radish Juice: ముల్లంగి జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!

Amazing Health Benefits of Radish Juice: ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కొందరు ముల్లంగిని సలాడ్‌గా కూడా తింటారు. కొంతమందరేమో ముల్లంగిని పరాఠాలు , భుర్జీలలో వాడతారు. ముల్లంగి ఏ రూపంలో తీసుకున్నా రుచికరంగా ఉంటుంది. ముల్లంగి రసం మీ శరీరానికి ఒక వరంలా పనిచేస్తుంది. ముల్లంగిలో ప్రోటీన్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
– ముల్లంగిలో ఉండే క్లోరిన్ , విటమిన్ సి రక్తం శుద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ముల్లంగి జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మంపై వచ్చే దద్దుర్లు, ఎరుపు, దురద, మొటిమలు బొబ్బ,లు తొలగిపోతాయి. ముల్లంగి స్కర్వీని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
– ముల్లంగి రసంలో కాలేయాన్ని క్లీన్ చేయడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేయడానికి కూడా పని చేస్తాయి. ముల్లంగి జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ, మూత్ర సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.
– గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ముల్లంగి జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం , పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
-ముల్లంగి , దాని ఆకులలో అధిక మోతాదులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా తరచుగా ముల్లంగి జూస్ తాగడం వల్ల దగ్గు, జలుబు రాకుండా నిరోధించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్, వాపు , అకాల వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది.
– జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ తీసుకోవడం అవసరం. ముల్లంగి ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బలహీనమైన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా, మలబద్ధకం, గ్యాస్ సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
– మీరు మీ బరువు పెరుగుతుందని ఆందోళన చెందుతుంటే.. ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి రసం తాగండి. ముల్లంగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి ఊబకాయం వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ముల్లంగి రసం ఎలా తయారు చేయాలి ?
ముల్లంగి రసం తయారు చేయడం చాలా సులభం. ముల్లంగి , దాని యొక్క ఆకులను బాగా కడిగి.. ముక్కలుగా కోయండి. ఇప్పుడు దానిలో కొంచెం అల్లం వేసి.. కాస్త నీరు పోసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆ రసాన్ని ఒక గ్లాసులోకి వడకట్టి.. అందులో కాస్త బ్లాక్ సాల్ట్ , పావు చెంచా నల్ల మిరియాల పొడి కలపండి. ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.