Last Updated:

Prabhas Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్..!

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త అప్‌డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంఛ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

Prabhas Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్..!

Prabhas Adipurush: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త అప్‌డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది.

మైథలాజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆదిపురుష్‌లో ప్ర‌భాస్‌ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, బాలీవుడ్ తార కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో ప్రేక్షకులను మెప్పించనుంది. అయితే 2023 జ‌న‌వరి 12న ఆదిపురుష్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్ర‌క‌టించింది. కాగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 2న అయోధ్య‌లో లాంఛ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ నిర్ణ‌యించారు.
టీజ‌ర్ లాంఛింగ్‌కు రాముడి జ‌న్మ‌స్థ‌ల‌మైన అయోధ్యనే స‌రైన ప్ర‌దేశ‌మ‌ని భావించిన మేక‌ర్స్ అక్కడే దానిని విడుదల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈవెంట్‌లో ప్ర‌భాస్‌, ఓం రౌత్ సంద‌డి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ రేసులో “ఆది”