Thandel OTT: అప్పుడే ఓటీటీకి తండేల్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Thandel OTT Release Update: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాగ చైతన్య కెరీర్‌లో వందకోట్లు సాధించిన చిత్రంగా తండేల్ రికార్డు నెలకొల్పింది. ప్రేమకథ, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లో మినిమమ్ ఆక్యూపెన్సీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కొన్ని థియేటర్‌లో అయితే హౌజ్‌ఫుల్ కూడా కనిపిస్తోంది.
అప్పుడే ఓటీటీకి
తాజాగా ‘తండేల్’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే తండేల్ డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తండేల్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్‌లో రన్ అవుతున్న ఈ సినిమాను ఒప్పందం ప్రకారం ఓటీటీకి తీసుకురానుంది. మూవీ రిలీజైన నెల రోజుల తర్వాత తండేల్‌ను డిజిటిల్ ప్రీమియర్‌కు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం మార్చి ఫస్ట్ వీక్‌లో తండేల్ ఓటీటీలోకి రాబోతుందని తాజాగా ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే మార్చి 6న లేదా 7వ తేదీన తండేల్‌లో ఓటీటీకి రానుందని తెలుస్తోంది.
త్వరలోనే అనౌన్స్‌మెంట్
అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. త్వరలోనే తండేల్ ఓటీటీ రిలీజ్‌పై ప్రకటన ఇవ్వనుందని సమాచారం. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. తండేల్ మూవీ హిట్‌కి దేవిశ్రీ అందించిన సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. నిజానికి మ్యూజిక్‌తోనే తండేల్‌పై అంచనాలు నెలకొన్నాయి. నిజ జీవిత సంఘటన ఆధారంగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాకుళం జాలర్లు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌లకు చిక్కడం, అక్కడి జైలుకు వెళ్లిన నిజ జీవిత ఘటనలను తీసుకుని లవ్ స్టోరీతో సినిమాను రూపొందించారు.