Published On:

Suicide Bomb In Syria: సిరియా చర్చిలో ఆత్మాహుతి దాడి

Suicide Bomb In Syria: సిరియా చర్చిలో ఆత్మాహుతి దాడి

Suicide Bombing in Syria Church: సిరియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారీగా ప్రాణనష్టం కలిగింది. రాజధాని డమాస్కస్ శివారులోని డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. కిక్కిరిసిన చర్చిలో జనం ప్రార్థనలు చేస్తుండగా ఘటన జరగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం మరింత బాధాకరమైన విషయం.

ముందుగా చర్చిలోకి జొరబడిన వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నట్టు ప్రజలు చెప్పారని సిరియా ఇంటర్నల్ అఫైర్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దుండగుడు చర్చిలో గ్రెనేడ్ విసిరినట్టు చర్చి బిషప్ చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తాను చూశానని, అతనితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. దాడిని సిరియా సమాచారశాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు.

ఇవి కూడా చదవండి: