Last Updated:

Sobhita Dhulipala on First Date: అప్పుడ చైతన్య కలిశాను – అదే మా ఫస్ట్‌ డేట్‌!

Sobhita Dhulipala on First Date: అప్పుడ చైతన్య కలిశాను – అదే మా ఫస్ట్‌ డేట్‌!

Sobhita Dhulipala Open Up on Love Story: అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు వీరు రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌ చేశారు. అయితే ఈ విషయాన్ని వీరు ఎప్పుడు వెల్లడించలేదు. విదేశాలకు వెకేషన్‌కి వెళ్లి మీడియాకు కంటపడ్డారు. అయినా కూడా తమ డేటింగ్‌ వార్తలపై వీరిద్దరు స్పందించలేదు.

ఇంటర్య్వూలో తాము స్నేహితులమేనిన చెబుతూ వచ్చింది శోభిత. అయితే సడెన్‌గా వీరు 2025 ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ జంట ప్రముఖ మ్యాగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. శోభిత, నాగచైతన్యలు జంటగా ‘వోగ్‌’ మ్యాగజైన్‌ కపుల్‌ కవర్‌ పేజీకి ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు వోగ్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో తమ పరిచయం, మొదటి డేటింగ్‌ గురించి చెప్పుకొచ్చింది శోభిత.

‘ఎందుకు చైని ఫాలో అవ్వడం లేదు?’

అయితే “చైతన్యతో పరిచయానికి ముందు సమయంలో సోషల్‌ మీడియాలో ఓ అభిమాని నుంచి తనకు ఎదురైన ప్రశ్నను గుర్తు చేసుకుంది. ఒక సారి ఓ అభిమాని సోషల్‌ మీడియాలో నన్ను ఇలా అడిగాడు. నాగ చైతన్య మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. కానీ మీరేందుకు ఫాలో అవ్వడం లేదు? అని ప్రశ్నించాడు. అప్పటి వరకు ఆ విషయం నాకు కూడా తెలియదు. అతడు అడగ్గాని చై ప్రోఫైల్‌ చూడగా.. నాతో పాటు 70 మందిని ఫాలో అవుతున్నాడు. అప్పటి నుంచి నేను చైతన్యను పాలో అవుతున్నా” అని పేర్కొంది.

అప్పుడే చైతన్యతో పరిచయం

“ఏప్రిల్‌ 2022లో చైతన్యను తొలిసారి కలిశాను. ఆ తర్వాత ఒకసారి చై నాకోసం ముంబై వచ్చాడు. అక్కడ ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఇద్దరం బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాం. అదే మా మొదటి డేట్‌. అయితే ఇదంతా చాలా సహజంగా జరిగిపోయింది. మేము ముందుగా ఏం ప్లాన్‌ చేసుకోలేదు, అనుకోలేదని పేర్కొంది. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో ప్రేమలో పడ్డాం. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపాం. వారు కూడా ఒకే అన్నారు. ఆ తర్వాత రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. అలా మా ప్రేమ మొదలైంది” అని శోభిత చెప్పుకొచ్చింది.