Last Updated:

Pawan Kalyan: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ – మృతుల కుటుంబాలకు పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం

Pawan Kalyan: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ – మృతుల కుటుంబాలకు పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం

Pawan Kalyan Financial Support to Two Youngs: రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ మూవీ జనవరి 10న థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌ నిర్వహించారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్‌ అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు.

తాజాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపు బాధితుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత యువకులు కాకినాడ గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్‌. గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లిన వీరిద్దరు అనంతరం ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏడీబీ రోడ్డు వద్ద వేగంగా వస్తున్న వాహనం వీరి ద్విచక్ర వాహనం ఢీకోనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకులు ఇద్దరు మరణించారు.

దీంతో ఈఘటన స్పందించిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బాధితులు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పిన ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా తగిన సాయం అందించేల ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు సూచించానన్నారు. మరోవైపు దిల్‌ రాజు కూడా బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. రెండు కుటుంబాలకు చేరో రూ. 5 లక్షల చోప్పున పది లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: