Home / సినిమా
యశోధ చిత్రం విడుదలకు ముందు సమంతా రూత్ ప్రభు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీపాదతో మాట్లాడని కారణంగా ఈ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుందని పుకార్లు వచ్చాయి.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.
సూపర్ స్టార్ కృష్ణ తన 80వ ఏట నేడు ఉదయం తెల్లవారు జామున మృతి చెందారు. కృష్ణ మరణంతో రెండు తెలుగు రాష్ట్రాలు సహా సినీలోకం ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరి ఈ నేపథ్యంలో కృష్ణ మధుర జ్ఞాపకాలను ఒకసారి గుర్తుచేసుకుంటూ ఆయన రేర్ ఫొటోస్ చూసేద్దాం.
టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ ఇకలేరని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పాటికే కృష్ణగారు, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండి ఉంటారు.
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని మహేష్ ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందర్శార్థం ఉంచారు. కాగా ఆయన పార్ధివ దేహానికి రేపు పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.
సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిత్రసీమలో సూపర్‌స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చారన్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ చూసిన మహేష్ కాస్త ధైర్యం లభించినట్టు అయ్యింది.
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.
నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీ నాట విషాధ ఛాయలు నెలకొన్నాయి. కళామ్మతల్లి ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. వెండితెరపై నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలుగొంది.. తెలుగు సినీ ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన హీరో కృష్ణ ఇకలేరు.