Last Updated:

Dragon OTT Release: ఓటీటీకి వచ్చేస్తోన్న లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘డ్రాగన్’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Dragon OTT Release: ఓటీటీకి వచ్చేస్తోన్న లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘డ్రాగన్’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Pradeep Ranganathan Dragon OTT Release: ‘లవ్‌టుడే’ చిత్రంతో భాషతో సంబంధం లేకుండ అందరిని ఆకట్టుకున్నాడు నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్. ఈ చిత్రంతో సౌత్‌లో మంచి గుర్తింపు పొందాడు. అతడు నటించిన లేటెస్ట్‌ మూవీ ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’. అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

బ్లాక్ బస్టర్ హిట్

బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఏకంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. థియేటర్లలో హిట్‌టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. తాజాగా దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. ‘డ్రాగన్‌’ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

ఆ రోజే ఓటీటీకి

ఒప్పందం ప్రకారం ఈ సినిమా నెల రోజుల్లో ఓటీటీకి తీసుకువస్తుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. మార్చి 21న డ్రాగన్‌ను స్ట్రీమింగ్‌కి ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను స్ట్రిమింగ్‌ ఇస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో మూవీ లవర్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. కాగా కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 150 పైగా కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

 

డ్రాగన్ కథ విషయానికి వస్తే

రాఘవన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌) ఇంటర్మీడియట్‌ 96 శాతంతో పాస్‌ అవుతాడు. దీంతో తాను ఇష్టపడిన అమ్మాయి కీర్తికి (అనుపమ పరమేశ్వరన్‌) ప్రపోజ్‌ చేస్తాడు. అయితే ఆఎమ తనకు బ్యాడ్‌ బాయ్స్‌ అంటేనే ఇష్టమని, నీలాంటి గుడ్‌ బాయ్స్‌ని తనకు సెట్‌ కారని అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. ప్రియురాలి కోసం రాఘవన్‌ బ్యాడ్‌ బాయ్‌గా మారతాడు. ఇంజనీరింగ్‌లో జాయిన్ అయితన అతడు 48 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యి రెండేళ్ల పాటు ఖాళీగా ఉంటాడు. అతడు సెటిల్‌ కాలేదని చెప్పి కీర్తి, రాఘవన్‌కు బ్రేకప్‌ చెబుతుంది. దీంతో లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని గోల్‌గా పెట్టుకున్న రాఘవన్‌ ఫేక్‌ సర్టిఫికేట్‌ సంపాదించి మంచి ఉద్యోగంలో చేరతాడు. తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగి ఇల్లు, కారు కొంటాడు. బాగా సెటిలైన అతడికి డబ్బున్న అమ్మాయి పల్లవి(కయాదు లోహర్‌) పెళ్లి ఫిక్స్‌ అవుతుందే. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో రాఘవన్ ఫేక్‌ సర్టిఫికేట్‌ గురించి కాలేజ్‌ ప్రిన్సిపాల్‌కు తెలుస్తుంది. దీంతో ఆ విషయం బయటపెట్టకుండ ఉండేందుకు అతడు రాఘవన్‌కి పెట్టిన కండిషన్‌ ఏంటి? ఒకేసారి 48 సబ్జెక్టులు ఎలా పూర్తి చేశాడు? మళ్లీ కీర్తి అతడి లైఫ్‌లోకి ఎందుకు వచ్చిందనేదే ‘డ్రాగన్‌’ కథ