Naga Chaitanya: శోభిత నటించిన ఆ రెండు సినిమాలు నాకు చాలా ఇష్టం!
Naga Chaitanya About Sobhita Movies: ప్రస్తుతం నాగ చైతన్య టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. తండేల్ మూవీ రిలీజ్ సందర్బంగా వరుస ఇంటర్య్వూలు, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా చై తరచూ తన భార్య శోభితపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమంటూ కొనియాడుతున్నాడు. ఇంటర్య్వూల్లో శోభిత గురించి ప్రస్తావిస్తూ తనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో శోభితపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
అన్ని విషయాల్లో శోభిత తనకేంతో సపోర్ట్‌గా నిలుస్తుందన్నాడు. “శోభిత తెలుగు అమ్మాయి. వాళ్లది వైజాగ్. మా ఇద్దరిది ఆంధ్ర బ్యాగ్రౌండ్ కావడంతో మా సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు ఒక్కటే. ఆమె తెలుగు చాలా బాగా మాట్లాతుంది. ఇద్దరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. భాష విషయంలో తను నాకు సాయం చేస్తుంది. అలాగే నేను ఎక్కడైన స్పీచ్ ఇవ్వాల్సి వస్తే తను నాకు హెల్ప్ చేస్తుంది. ఎలా మట్లాడాలి, ఏం చేయాలని అన్ని గైడ్ చేస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
ఇక శోభిత నటించిన సినిమాల్లో రెండు ప్రాజెక్ట్స్ తనకు చాలా ఇష్టమని చెప్పాడు. మేడ్ ఇన్ హెవన్, మేజర్ చిత్రాలకు తనకెంతో ఇష్టమని, ఈ సినిమాల్లో ఆమె నటన చాలా బాగుంటుందని కొనియాడాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో చై శోభిత గురించి మాట్లాడుతూ.. తనని ఇంట్లో బుజ్జితల్లి అని పిలుస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని విషయాల్లో తన అభిప్రాయాలు తీసుకుంటానని, తెలుగు సంస్కృతులు, సంప్రదాయాలను ఆమె చాలా బాగా ఫాలో అవుతుందని చెప్పాడు. ఇక తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను శోభిత దగ్గరుండి చూసుకుందని అన్నాడు.