Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 17 ఎపిసోడ్ లో మోనితకు చుక్కలు చూపిస్తున్న దుర్గా

ఆ మాటలు విన్న మోనిత కోపంగా ‘రేయ్.. నేనెందుకు దీప అడ్డు తొలగించాలనుకుంటాను’ అని అంటుంది. అప్పటికే కార్తీక్ అక్కడికి వచ్చి... మొత్తం వింటూ ఉంటాడు.కార్తీక్ అక్కడే ఉన్నాడన్న విషయం మోనిత చూసుకోలేదు.

Karthika Deepam: అక్టోబర్ 17 ఎపిసోడ్ లో మోనితకు చుక్కలు చూపిస్తున్న దుర్గా

Karthika Deepam: నేటి కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందన్న విషయం తెలియని దుర్గ కావాలనే.. కార్తీక్ వినేలా.. మోనిత దగ్గరకు వచ్చి.. ‘ఏంటి మా డార్లింగ్ ఈ రోజు డల్‌గా ఉంది…దీపని చంపించడానికి రౌడీలను పెట్టావ్ కానీ ఆ పని జరగలేదని బాధపడుతున్నావా?’ అని అంటాడు.ఆ మాటలు విన్న మోనిత కోపంగా ‘రేయ్.. నేనెందుకు దీప అడ్డు తొలగించాలనుకుంటాను’ అని అంటుంది. అప్పటికే కార్తీక్ అక్కడికి వచ్చి… మొత్తం వింటూ ఉంటాడు.కార్తీక్ అక్కడే ఉన్నాడన్న విషయం మోనిత చూసుకోలేదు.

‘నిజమే దీపని అడ్డు తప్పిస్తే మనకి ఏమొస్తుంది ? కార్తీక్ అడ్డు కదా మనం తొలగించుకోవాలిసింది ? కార్తీక్ కోసమే రౌడీలను పెట్టావ్ కదూ..? మన రిలేషన్‌కి కార్తీక్ అడ్డు రావద్దు అని కార్తీక్‌ని తప్పించాలనుకుంటున్నావ్ కదా?’ అంటూ దుర్గా కావాలనే మాట్లాడతాడు.అది అంతా కార్తీక్ వింటాడు.అరేయ్ నీకు దన్నం పెడతాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు ప్లీజ్’ అంటూ అక్కడ నుంచి దుర్గని పంపించేసి వెనక్కి తిరిగేసరికి.. కార్తీక్ ఉంటాడు.‘ఏంటి మోనిత నువ్వు చేసింద.. దుర్గ అన్న దానిలో నిజం ఎంతా?’ అంటూ గట్టిగానే నిలదీసి అడుగుతాడు.మోనిత కళ్లనిండా నీళ్లతో.. తనదేం తప్పు లేదని చెబుతుంది కానీ కార్తీక్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.అబ్బా ఇప్పుడు చూడటానికి ఎంత బావుందో కార్తీక్ కూడా దీప, దుర్గల డ్రామాకు కాస్త బలాన్ని చేర్చుడంతో మోనిత బిడ్డ విల విలలాడిపోతుంది.

ఇవి కూడా చదవండి: