Last Updated:

Nikhil : త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్ ..

Nikhil: ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు.

Nikhil : త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్ ..

Nikhil: ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు. ఈ పెళ్ళిలో మెగా హీరోలందరూ ఓకే ఫ్రెమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. శర్వానంద్ భార్య అమెరికాలో బిడ్డకు జన్మనివ్వనుందని కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మరో హీరో తండ్రి కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ హీరో మరెవరో కాదు నిఖిల్.యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ విజయం సాధించింది.

ఇదిలా ఉంటే నిఖిల్ 2020లో ప‌ల్ల‌వి వ‌ర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. నిఖిల్ సతీమణి ఇటీవలే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్ళింది. అక్కడ ఆమె బేబీ బంప్ తో కనిపించారని నిఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. దాంతో నిఖిల్ తండ్రి కాబోతున్నడన్న ప్రచారం జోరందుకుంది. దీని పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తాజాగా నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్వయంభు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరాకక్కుతున్న స్వయంభు సినిమా లో నిఖిల్ లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.పాన్ ఇండియా మూవీగా స్వయంభు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.స్వయంభు సినిమా నిఖిల్ 20వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది…