Last Updated:

Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(18 సెప్టెంబర్ 2022)

ఈరోజు అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ కొన్ని చెడువి జరిగిన వాటికి నిరాశపడకుండా అంతా మనమంచికే జరుగుతుందనే చింతనతో పనులలో ముందుకు కదలండి. కుటుంబంతో సంతోషంగా కొంత సమయం గడపండి. 

Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(18 సెప్టెంబర్ 2022)

ఈరోజు అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ కొన్ని చెడువి జరిగిన వాటికి నిరాశపడకుండా అంతా మనమంచికే జరుగుతుందనే చింతనతో పనులలో ముందుకు కదలండి. కుటుంబంతో సంతోషంగా కొంత సమయం గడపండి.

1. మేషం: ఈ రాశి వారి చెయ్యదలచిన పనులు ఈ వారంలో మరింత వేగం పుంజుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

2. వృషభం: ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. సన్నిహితుల నుండి ఒత్తిడులు ఎదురవుతాయి. అనవసరమైన వాటిలో వీరు కలుగజేసుకోకుండా ఉంటే మంచిది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి.

3. మిథునం: వీరు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తులు సమకూరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఈ రాశివారికి అనుకూలిస్తాయి.

4. కర్కాటకం: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. మిత్రులతో వివాదాలు వస్తాయి. అనారోగ్యం సమస్యలు వెంటాడుతాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయ ప్రయాసలు ఉంటాయి. పనుల్లో అవాంతరాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

5. సింహం: వీరికి నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాహనయోగం ఉంటుంది. వ్యాపార వాణిజ్య చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

6. కన్య: ఈ రాశివారు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఉద్యోగావకాశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషదాయకంగా గడుస్తుంది. వస్తులాభాలు ఉంటాయి. వ్యాపారాలు, అనుకూలిస్తాయి.

7. తులా రాశి: ఈ రోజు ఆఫీసు పని వల్ల ఒత్తిడికి గురవుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు కొంత సమయాన్ని మీ కుటుంబంతో గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రోజు మీ ప్రేమ అందంగా మారబోతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కోపం తగ్గించుకోవాలి లేదంటే చాలా నష్ట పోతారు. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి. మీ ప్రియురాలిని గుర్తు చేసుకుంటారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం వస్తుంది.

9. ధనస్సు రాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ రోజు మీ జీవితంలో కొత్త వ్యక్తి రాబోతున్నారు. బయటికి వెళ్లి వస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండండి . పెళ్ళి పై ఒక నిర్ణయానికి వస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి: ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలకు మీ డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంది. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి.

11. కుంభ రాశి: మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆరోగ్య సమస్యల వల్ల కొత్త బాధలు వస్తాయి. ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీకు అందంగా ఉండబోతుంది. మీ కోపం వలన చాలా కోల్పోవాలిసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు.

12. మీన రాశి: డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీరు డబ్బు విలువను తొందరలోనే తెలుసుకోనున్నారు. పాత
స్నేహితులను కలుసుకుంటారు. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోండి. ఎంత బీజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

ఇదీ చదవండి: Horoscope Today : రాశి ఫలాలు (శనివారం సెప్టెంబర్ 17 , 2022)

ఇవి కూడా చదవండి: