Home / భక్తి
యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు గత 2రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది.
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఊరు ఉంది. ఈ దేవాలయం ఏకశిలానగరమఅని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతి ఏటా రాములు కల్యాణం బాగా జరిపిస్తారు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు వల్ల అక్కడ ఉన్న భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో , చెత్త చేదారాల వల్ల భక్తులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం. పంచముఖ అవతారం. ఈ క్రమంలోనే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టాల నుంచి అయినా బయట పడవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
వృత్తి ఉద్యోగాలలో వత్తిడి ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు.ఆరోగ్యం జాగ్రత్త.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్దనల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని హిందువులు పారాయణం చేస్తుంటారు.
ఈ రోజు సమాజంలో పలుకుబడి వున్నవ్యక్తులతో పరిచయం జరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.
శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.