October 2022 Horoscope: అక్టోబర్ నెలలో ఈ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి !
October 2022 Horoscope: అక్టోబర్ నెలలో ఈ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి !
Horoscope: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి.అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథునరాశిలో అంగారక సంచారం వల్ల అక్టోబరు నెలలో ఈ మూడు రాశుల వారికి ఇబ్బంది కరంగా మారనున్నాయి. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మేషం రాశి :-
మిథునరాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన వారికి కొత్త ఇబ్బందులు ఎదుర్కొనున్నారు . ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్చలకు చాలా దూరంగా ఉండండి. అయితే ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వృషభం :-
ఈరాశి వారికి అంగారకుడి సంచారం వలన పరిస్థితులు అశుభంగా మారనున్నాయి. వీరి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా పెరగవచ్చు. దీంతో వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువుగా ఉంది.
మిథున రాశి :-
మిథునరాశిలో కుజుడు సంచారం వలన ఈ రాశివారి ఆరోగ్యం మరింత బలహీనపడుతుంది. దీంతో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి .అలాగే ఆస్తిని కొనుగోలు చేయడానికి ఈ సమయం సరైనది కాదు.