Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిదని సూచన..

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిదని తెలుస్తుంది. అలాగే జూలై 12 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిదని సూచన..

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిదని తెలుస్తుంది. అలాగే జూలై 12 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం..

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి చాలావరకు బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మిథునం..

ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్తత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం..

ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని మాత్రమే పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. కుటుంబంలో ఒక శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో చికాకులు పెరిగే అవకాశం ఉంది.

సింహం..

ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అనుకోకుండా కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది.

కన్య..

వృత్తి, ఉద్యోగాలు మామూలుగానే సాగిపోతాయి. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యూహాలు రూపొందించడం వంటివి జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. బంధుమిత్రులను వ్యక్తిగతంగా కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ దర్శనం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

తుల..

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం..

తోబుట్టువులతో ఆస్తి వివాదాలు లేదా కుటుంబ సంబంధమైన వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరితోనూ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు.

ధనస్సు..

నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళతాయి.

మకరం..

వృథా ఖర్చులు మాత్రం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్ళే బయలుదేరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.

కుంభం..

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరు దూర ప్రాంతంలో స్థిరపడడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం..

వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళతాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు.