Last Updated:

Drown in River: నల్లమడ వాగులో నలుగురు హైదరాబాద్ వాసుల గల్లంతు

ఏపీలోని బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యలంక వచ్చిన వీరు మధ్యల నల్లమడ వాగులో ఈతకు దిగినపుడు ఈ దుర్ఘటన జరిగింది.

Drown in River: నల్లమడ వాగులో నలుగురు హైదరాబాద్ వాసుల  గల్లంతు

Drown in River: ఏపీలోని బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యలంక వచ్చిన వీరు మధ్యల నల్లమడ వాగులో ఈతకు దిగినపుడు ఈ దుర్ఘటన జరిగింది.

ఒకిరిని రక్షించబోయి..(Drown in River)

హైదరాబాద్ జగద్గురు గుట్ట కు చెందిన 12 మంది మారుతి వ్యాన్ లో బాపట్ల జిల్లాలోని సూర్యలంక కు వచ్చారు. సూర్యలంక వద్ద ఉన్న వీరన్నపాలెం బంధువుల ఇంటికి వెళ్తూ.. నిన్న మధ్యాహ్నం 12 గంటలకి బాపట్ల సమీపంలో ఉన్న నాగరాజు కాలవద్ద కారు ఆపి నలుగురు నాగరాజు కాలవలోనికి దిగారు. ఈ క్రమంలో సన్నీఅనే బాలుడు కాలువ లోకి జారిపోవడంతో.. పక్కనే ఉన్న తండ్రి సునీల్ కుమార్ రక్షించే క్రమంలో గల్లంతయ్యాడు. అదేవిధంగా ఒకరినొకరు రక్షించే ప్రయత్నం చేస్తూ కిరణ్, నందు, కాలువ లోనికి దిగి నలుగురు కొట్టుకుపోయారు. దీనితో మొత్తం నలుగురు కాలువలో పడి దుర్మరణం చెందారు. ప్రస్తుతానికి రెండు మృతదేహాలు దొరకగా మరో రెండు మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని బాపట్ల డిఎస్పి మురళీకృష్ణ తెలిపారుతెలిపారు.

ఇవి కూడా చదవండి: