Pepsi: ఇప్పుడు పెప్సీ వంతు.. భారీగా లేఆఫ్స్ ప్రకటన
మస్క్ మొదులు పెట్టిన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా పలు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల ఏరివేతను మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సీ కూడా వచ్చి చేరింది.
Pepsi: మస్క్ మొదులు పెట్టిన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్ సహా పలు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల ఏరివేతను మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సీ కూడా వచ్చి చేరింది.
2025 నాటికి దాదాపు 6 వేల మందిని తొలగిస్తామని హెచ్‌పీ ఇటీవల ప్రకటించగా, అమెజాన్ 20 వేల మందిని ఇంటికి పంపిస్తోంది. ఫేస్‌బుక్‌లో దాదాపు 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తుండగా, తాజాగా ఈ జాబితాలోకి పెప్సీ కో వచ్చి చేరింది. నార్త్ అమెరికాలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్ పెప్సికోలో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే ఇంటర్నల్ మెమోలను అందించినట్టు వాల్ స్ట్రీట్ సంస్థ కథనంలో వెల్లడించింది. అయితే, దీనిపై పెప్సీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: ఎస్ఎంఎస్ కు 30 ఏళ్లు.. మొట్టమొదటి ఎస్ఎంస్ ఏమని పంపారో తెలుసా..?