Jagannath Rath Yatra: జగన్నాథుడి రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు!

Jagannath Rath Yatra: గుజరాత్‌లోని గోల్‌వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా భక్తులపైకి ఏనుగు దూసుకెళ్లింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ రథయాత్రకు లక్షల మంది భక్తులు తరలివస్తుండడంతో ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే పూరితో పాటు దేశ వ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్రలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఇందులో భాగంగానే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉదయం 5 గంటల సమయంలో జగన్నాథ్, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను తీసుకొచ్చి రథాలపై ఉంచారు. ఆ తర్వాత రథయాత్రను సీఎం బూపేంద్ర పటేల్ పహింత్ ప్రారంభించారు. ఈ రథయాత్ర కోసం ప్రత్యేకంగా 17 ఏనుగులు తీసుకురాగా.. ఇందులో నుంచి 3 ఏనుగులు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లాయి. కొంతమంది పరుగులు తీయగా.. మరికొంతమంది గాయపడ్డారు.
వెంటనే జూ అధికారులు రంగంలోకి ప్రవేశించి ఏనుగులను కట్టడి చేసేందుకు యత్నించారు. 3 ఏనుగులను బయటకు తీసుకెళ్లగా.. మిగతా 14 ఏనుగులతో రథయాత్ర ఊరేగింపు కొనసాగించారు. కాగా, హోం మంత్రి అమిత్ షా కుటుంబసమేతంగా జమల్ పూర్ జగన్నాథ ఆలయానికి వెళ్లి మంగళహారతిలో పాల్గొన్నారు.
VIDEO | Gujarat: Three elephants go out of control during Jagannath Rath Yatra in Ahmedabad.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HYWt1hC4sX
— Press Trust of India (@PTI_News) June 27, 2025