Home / బ్రేకింగ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా కుటుంబం సానుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి.
తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది.
ముంబై నగరంలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాగ్లైడర్లు, ప్రైవేట్ హెలికాప్టర్లు మరియు హాట్ ఎయిర్ బెలూన్లను నవంబర్ 13 నుండి డిసెంబర్ 12 వరకు ఎగరవేయడాన్ని నిషేధించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో 'మోదీ నో ఎంట్రీ' అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.NewsTelanganaHyderabadP