Last Updated:

TVS iQube: గేమ్ ఛేంజర్‌‌గా టీవీఎస్ ఐక్యూబ్.. సేల్స్‌లో టాప్ లేపింది.. ఎంత మంది కొన్నారో తెలుసా..?

TVS iQube: గేమ్ ఛేంజర్‌‌గా టీవీఎస్ ఐక్యూబ్.. సేల్స్‌లో టాప్ లేపింది.. ఎంత మంది కొన్నారో తెలుసా..?

TVS iQube: టీవీఎస్ మోటార్ విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. దేశీయ మార్కెట్‌లో కంపెనీ విక్రయిస్తున్న బైక్‌లు, స్కూటర్లు ఆకర్షణీయంగా ఉండడంతో మంచి సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల టీవీఎస్ ఫిబ్రవరి నెలలో దాని మొత్తం అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 403,976 యూనిట్లను విక్రయించింది. 2024లో ఇదే కాలంలో విక్రయించిన 368,424 యూనిట్లతో పోలిస్తే, సంవత్సరానికి వృద్ధి 10శాతం వృద్ధిని చూపిస్తుంది.

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోనూ టీవీఎస్ సరికొత్త చరిత్రను లిఖించింది. గత నెలలో (ఫిబ్రవరి – 2025) 24,017 యూనిట్ల ద్విచక్ర వాహనాలు విజయవంతంగా విక్రయించబడ్డాయి. ఫిబ్రవరిలో విక్రయించిన 17,959 యూనిట్లతో పోలిస్తే 2024 సంవత్సరానికి (YoY) 34శాతం వృద్ధిని సాధించింది.

ఈ స్థాయిలో టీవీఎస్ విజయానికి iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ప్రధాన కారణం. దీని ధర రూ. 1.07 లక్షల నుండి రూ. 1.37 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇందులో 2.2 కిలోవాట్, 3.04 కిలోవాట్, 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇవి పూర్తి ఛార్జింగ్ పై 75 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) అందిస్తుంది.

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 75 నుండి 82 kmph. ఇందులో 7-అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, వాయిస్ అసిస్ట్ అలెక్సా స్కిల్‌సెట్,టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. టైటానియం గ్రే మ్యాట్ మరియు స్టార్‌లైట్ బ్లూ రంగులలో కూడా అందుబాటులో ఉంది.

TVS ​​X ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2.50 లక్షల ఎక్స్-షోరూమ్. దీనిలో 4.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఫుల్ ఛార్జ్‌తో 140 కిలోమీటర్లు నడుస్తుంది.ఈ స్కూటర్ గరిష్ట వేగం 105 kmph. ఇది కేవలం 2.6 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. స్కూటర్‌లో TFT కన్సోల్ (10.25-అంగుళాల), క్రూయిజ్ కంట్రోల్, నావ్‌ప్రో నావిగేషన్, జియోఫెన్సింగ్‌తో సహా అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ‘టీవీఎస్’ అత్యంత వేగంతో కొనసాగడం శుభపరిణామం. ముఖ్యంగా కస్టమర్లు ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను ప్రేమగా కొనుగోలు చేస్తున్నారు. టీవీఎస్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటోలను అధిగమించి రానున్న రోజుల్లో మొదటి స్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.