Last Updated:

Maruti Suzuki e Vitara: అబ్బా బీభత్సం.. మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా..?

Maruti Suzuki e Vitara: అబ్బా బీభత్సం.. మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా..?

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ప్రస్తుతం తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారాని విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో దీన్ని తొలిసారిగా పరిచయం చేశారు. ఈ విటారా పరిమాణంలో కాంపాక్ట్, ప్రత్యేకంగా ఏమీ కనిపించదు. అయితే ఇందులో ఇచ్చిన ఫీచర్లు చాలా బాగున్నాయి. ఇటీవల ఈ ఎస్‌యూవీ హిమాచల్‌లో టెస్టింగ్‌లో కనిపించింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ విటారా కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి కొత్త ఈ విటారా 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. దీని పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. దీన్ని కొత్త ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారరు. కొలతల గురించి చెప్పాలంటే, దీని పొడవు 4,275మిమీ, వెడల్పు 1,800మిమీ, ఎత్తు 1,635మిమీ, వీల్‌బేస్ 2,700మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180మిమీ. కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో కొత్త ఈ విటారాను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని నెక్సా అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు.

కొత్త ఈ విటారాలో 7 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు అందించారు. ఇందులో ప్యాడిల్ డ్రైవింగ్ మోడ్,ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇది 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRL, ముందు భాగంలో వెనుక ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఇచ్చిన డ్రైవర్ సీటును 10 రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం మే (మే 2025) నాటికి కొత్త ఈ విటారా లాంచ్ అవుతుంది. దీని ధర రూ. 16-17 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ-విటారా బుకింగ్ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త ఈ విటారా భారతదేశంలోని హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో నేరుగా పోటీపడుతుంది. ఎలక్ట్రిక్ క్రెటా ఎక్స్-షో రూమ్ ధర రూ. 17.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, లెవల్ 2 అడాస్, యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లను ఇందులో చూడచ్చు.

డీసీ ఛార్జింగ్ సహాయంతో 10శాతం-80శాతం ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది. అయితే ఏసీ హోమ్ ఛార్జింగ్ సహాయంతో, 10శాతం-100శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. అందులో ఇచ్చిన స్పేస్ కూడా చాలా బాగుంది. అందులో 5 మంది హాయిగా కూర్చోవచ్చు. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, కీ-లెస్ ఎంట్రీ, వెనుక ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో కనిపిస్తాయి.