Home /Author M Rama Swamy
Operation Garuda : మత్తును కలిగించే డ్రగ్స్ అమ్మకాలపై ఈగల్ విభాగం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ఏపీవ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఐజీ ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సైకోటిక్ మెడిసిన్‌ను […]
White Ration Card : తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారులకు కాంగ్రెస్ సర్కారు పండుగ లాంటి శుభ వార్త చెప్పింది. ఉగాది పండుగ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉగాది పండుగ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజల అనంతరం సన్నబియ్యం పంపిణీ […]
Harish Rao : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మార్పు పేరుతో అనేక వాగ్దానాలు ఇచ్చారని, గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చడం మార్చిపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఇవాళ జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీతులు చెప్పారని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్‌తో […]
Komatireddy Venkat Reddy : గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు 40 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. 6 నెలలు లేదా 3 నెలలకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి డబుల్ రహదారులు వేయిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే రోడ్లు వేశారని […]
Tenth Exams : రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో ఎగ్జామ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన […]
AP Deputy Speaker : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ‘ఏమంటివి.. ఏమంటివి?’ అంటూ దారవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని […]
Amit shah : ఛతీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్‌ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల పఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదన్నారు. అలాంటి వారిపట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. మన సైనికులు […]
Marri Rajasekhar : త్వరలోనే టీడీపీలో చేరతానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, మోసం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఉన్న తాను 2011లో వైసీపీలో చేరినట్లు చెప్పారు. 14 ఏళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేననట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం ఖాయం అనుకుంటున్న వేళ […]
Revanthreddy : రవీంద్ర భారతిలో ఇవాళ ‘కొలువుల పండుగ’కార్యక్రమం జరిగింది. పంచాయతీ రాజ్‌శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల, అమరవీరుల ఆకాంక్షల ఫలితమే తెలంగాణ ఏర్పాటు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాలనలో 55 వేల […]
Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకు ఉన్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికి వస్తుందని ఎక్స్ సంస్థ తన పిటిషన్లో […]