Home /Author Jaya Kumar
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టిల్లు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది. సాధారణంగానే పవన్ కి సంబంధించి ఏదైనా విషయం ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఒకేసారి రెండు విషయాలు కలిసి రావడంతో పవన్ పై అభిమానాన్ని చూపేందుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెలరేగుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాలు తార "తమన్నా".. హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా… అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ… ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు.
పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే పెద్దలు చెబుతూ ఉండేది అందుకే.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి మిత్రులతో విభేదాలు తొలగిపోతాయని తెలుస్తుంది. అలాగే మార్చి 11 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..