Last Updated:

Vastu Tips : ఏ దిక్కు వైపు కూర్చొని ఆహరం తీసుకుంటే మంచిదో తెలుసా..?

పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే పెద్దలు చెబుతూ ఉండేది అందుకే.

Vastu Tips : ఏ దిక్కు వైపు కూర్చొని ఆహరం తీసుకుంటే మంచిదో తెలుసా..?

Vastu Tips :  పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే పెద్దలు చెబుతూ ఉండేది అందుకే. కాగా మనం తీసుకునే ఆహారం అనేది మన ఆరోగ్యానికి, మన శరీరం పొందే శక్తికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఆహారం విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వంట చేయడానికి, తినడానికి, వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని పద్ధతులు సూచించబడ్డాయి. అవేంటో ప్రత్యేకంగా మీకోసం..

ఏ దిక్కు వైపు కూర్చుంటే మంచిదంటే (Vastu Tips)..

తూర్పు లేదా ఈశాన్య ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి ఆహారం నుండి పూర్తి శక్తిని పొందుతాడు.

అలానే పశ్చిమ దిశను లాభాల దిశగా పరిగణిస్తారు. వ్యాపారం చేసేవారు లేదా ఉద్యోగంలో ఉన్నవారు లేదా రచనలు, విద్య, పరిశోధన మొదలైన పనులతో సంబంధం ఉన్నవారు కూడా ఈ దిశలో కూర్చుని ఆహారం తీసుకోవాలి.

ఉత్తరాభిముఖంగా ఆహారం తీసుకోవడం కూడా మంచిది. ఇది మానసిక ఒత్తిడి మరియు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతుంది. ఆరోగ్యం బాగానే కొనసాగుతోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఉత్తరాభి ముఖంగా ఆహారం తీసుకోవాలి. కెరీర్ తొలిదశలో ఉన్నవారు కూడా ఈ దిశలోనే ఆహారం తీసుకోవాలి. ఈ దిశ సంపద, జ్ఞానం, ఆధ్యాత్మికతకు దిశగా పరిగణించ బడుతుంది.

మీరు దక్షిణ దిక్కుకు తిరిగి ఆహారం తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. దక్షిణ దిక్కును యమరాజు దిశగా పరిగణిస్తారు. యమరాజు మృత్యుదేవత. దక్షిణాభి ముఖంగా ఆహారం తీసుకుంటే ప్రాణహాని కలుగుతుందని అంటున్నారు.

ఆకుపచ్చని ఆకులో భోజనం వడ్డించుకుని భోజనం చేస్తే దేవి అన్నపూర్ణ ఆనందిస్తుంది. అందుకే దేవుడికి నైవేద్యం పచ్చని ఆకులో వడ్డించాలని చెబుతారు. వెండి పళ్లెం భోజనానికి ఉపయోగించేట్టయితే తప్పనిసరిగా పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉండాలి. అలా లేని వెండి పళ్లెం భోజనానికి పనికిరాదు. భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా దరిద్రానికి చిహ్నం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను దైవ ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. భోజనం ముగించిన తర్వాత పశువులకు లేదా పక్షులకు లేదా చీమలు వంటి కీటకాలకు పెట్టాలి. అలానే తినేటప్పుడు గ్లాసులో నీళ్లు ఎప్పుడూ కుడి వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే శుభాలు కలిగి జీవితం ఆనందంగా ఉంటుంది.

అదే విధంగా భోజనం తర్వాత ప్లేట్ లో ఎప్పుడూ చేతులు కడగకూడదు. ఇలా చేస్తే సంపద నశిస్తుంది. ముఖ్యంగా భోజనం ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన పళ్లెం లోనే చెయ్యాలి. అలా చెయ్యకపోతే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/