Kavitha Flex In Hyderabad : హైదరాబాద్ లో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు.. బై బై మోదీ అంటూ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

Kavitha Flex In Hyderabad : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కవిత ఈడీ విచారణ సమయంలో.. ఈడీ, సీబీఐ లతో బీజేపీ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీలో చేరిన కొందరు నాయకులను పేర్కొంటూ నగరంలోని పలుచోట్ల పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేత సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలను ఉంచారు. చివర్లో బై బై మోదీ అని ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలలో రాసుకొచ్చారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/