Home /Author anantharao b
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన రాజకీయ ప్రేరేపితమైనది కాదని రెజ్లర్ సాక్షి మాలిక్ మరియు ఆమె భర్త సత్యవర్త్ కడియన్ చేసిన ప్రకటనపై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ ఆదివారం నాడు మండిపడ్డారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని కూడా ఆమె ఆరోపించారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. వరోవైపు సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భారీ ఆగ్రహానికి ప్రతిస్పందించిన మేకర్స్, ప్రేక్షకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని డైలాగ్‌లను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అదిరిపోయిందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. బస్సు యాత్ర మొదలయి, పూర్తయే నాటికి జనసేన గ్రాఫ్ మరింత పెరిగి ఒంటరిగా ఎన్నికలలో ప్రయాణం చేసినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని తాను ఎప్పుడో చెప్పానని జోగయ్య గుర్తు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేపట్టిన వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో కాకినాడలో పార్టీ నాయకుల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉందంటూ పేర్కొన్నారు.
: లండన్‌లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్‌వెల్‌లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీలోని ఆర్ కె పురం అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారిని అర్జున్ మరియు మైఖేల్‌గా గుర్తించారు. బాధితుల సోదరుడితో వారికి ఆర్థిక వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో98 మంది మరణించారు. యూపీలో 54 మంది చనిపోగా, బీహార్‌లో గత మూడు రోజుల్లో 44 మంది మరణించారు.
వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతల రౌడీయిజం పై మండిపడ్డారు. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. గూండాగాళ్లు, హంతకులు, నేరస్తులతోటి పాలించబడటానికి సిగ్గుండాలి. నేను సినిమా మాటలు మాట్లాడటం లేదు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్ కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. విల్లుపురం కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి పది వేల జరిమానా కూడా కోర్టు విధించింది.