Home /Author anantharao b
భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామంటూ కర్ణాటక హైకోర్టు ఫేస్‌బుక్‌కు హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఫేస్బుక్ సహకరించడం లేదని ఆరోపించిన నేపధ్యంలో కోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.
బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
: జనాభా సంక్షోభాన్ని నివారించడానికి చైనా రాజధాని బీజింగ్ పునరుత్పత్తి సేవలకు వైద్య బీమా కవరేజీని విస్తరించాలని నిర్ణయించింది.జూలై 1 నుండి, స్పెర్మ్ ఆప్టిమైజేషన్ నుండి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ వరకు సేవలు 16 రకాల వైద్య సదుపాయాలు రీయింబర్స్ చేయబడతాయి
ఆస్ట్రేలియా చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ తాను పార్లమెంటులో లైంగిక వేధింపులకు గురయ్యానని మహిళలు పని చేయడానికి పార్లమెంట్హ భవనం సురక్షితమైన స్థలం కాదని పేర్కొన్నారు. తోటి సెనేటర్ తనపై అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించాడని తనను అనుచితంగా తాకాడని కన్నీళ్లతో సెనేట్ లో చెప్పారు. అతను చాలా శక్తివంతమైన మనిషని కూడా తెలిపారు.
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక కేబినెట్ గురువారం ప్రకటించింది.'ప్రలోభం', 'బలవంతం', 'బలవంతం', 'మోసపూరిత మార్గాలు' మరియు 'సామూహిక మార్పిడి' ద్వారా మత మార్పిడిని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లును కర్ణాటక శాసనసభ డిసెంబర్ 2021లో ఆమోదించింది.
టిట్లాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ ( టిఆర్ఎస్ఎల్ ) మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( బీహెచ్ఈఎల్ ) యొక్క కన్సార్టియం 80 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీకి రైల్వేతో ఒప్పందం కుదుర్చుకుంది
విశాఖపట్నంలో ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, ఆయన కుమారుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు మోపిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసు అధికారులు కోర్టులో 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.సింగ్ తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళా రెజ్లర్లు ఆరోపించడంతో గతంలో కేసు నమోదైంది.
బిపర్ జోయ్ తుఫాను ఈరోజు గుజరాత్‌లోని జాఖౌ నౌకాశ్రయానికి సమీపంలో సౌరాష్ట్ర మరియు కచ్ ను ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు బిపర్ జోయ్ తుఫాను తీరం దాటనుంది.
:మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది.