Home /Author anantharao b
అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, హోటల్స్ బుకింగ్ గదులపై అదనపు తగ్గింపులను అందించాలని ఆల్ జమ్మూ హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021కి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపహస్యంగా పేర్కొన్నారు.
వందలాది మంది పౌరుల మరణానికి దారితీసిన గ్రీస్ పడవ దుర్ఘటన వెనుక మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రకటించారు. ఇప్పటి వరకు, మానవ అక్రమ రవాణాకు కారణమైన కనీసం 10 మంది సబ్ ఏజెంట్లను పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల నుండి అరెస్టు చేశారు.
చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టు గా ప్రకటించిన కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. అతను గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులమని చెప్పి మీసాలు తిప్పిన వాళ్లు కూడా పరకాలలో పోటీ చేయడానికి భయపడుతున్నారన్న కేటీఆర్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వాణ్ని.. మీసాలు పెంచి, మెలేయడం తమకు రాజుల కాలం నుంచి వచ్చిందని కొండా మురళి అన్నారు
ఒళ్లు పొగరెక్కి వున్నావు..మీ తాతకు డీటీ నాయక్ చేసినట్లు నీకు ఈ భీమ్లా నాయక్ చేస్తాడంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఆదివారం రాత్రి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
మద్యం మత్తులో స్పృహతప్పిన మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక భారతీయ విద్యార్థిని యూకేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని వారు తెలిపారు.
అక్రమ వలసలపై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ యూకే హోమ్ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి 20 దేశాలకు చెందిన 105 మంది విదేశీ పౌరులను అరెస్టు చేయడంలో పాల్గొన్నారు.
: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.