Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
విదేశీ ఉగ్రవాదులే..( Jammu Kashmir Encounter)
గురువారం తెల్లవారుజామున జుమాగండ్ వద్ద విదేశీ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సైన్యంపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులతోపాటు సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నదని ట్వీట్ చేశారు. మరణించిన ముష్కరులంతా విదేశీ ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు.
ఈ నెల 13న కూడా కుప్వారాలో ఎల్‌ఓసీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని డోబనార్ మచ్చల్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌందర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Janasena chief Pawan Kalyan: చేబ్రోలును సిల్క్ సిటిగా మార్చే బాధ్యత నాది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్
- Telangana CM KCR: మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన.. తెలంగాణ సీఎం కేసీఆర్
- Anti-Conversion Act: మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం