Home /Author anantharao b
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)బాంబే కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూ.315 కోట్లను విరాళంగా ఇచ్చారు. నీలేకని 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఇన్స్టిట్యూట్లో చేరారు.
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్‌లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్‌లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.
ఆదిపురుష్ సినిమా ఇటీవల ఇండియాలో విడుదలైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. కలెక్షన్ల పరంగా సినిమా బాగానే డబ్బు వసూళ్లు చేస్తోంది. ఇండియా సంగతి పక్కనపెడితే పొరుగున ఉన్న నేపాల్ మాత్రం ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్‌ల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది.
తాను కమిట్మెంట్తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.
అదిలాబాద్ యం.పి సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ నేతలతో తన నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి కూడా కుమార్తె తుల్జా భవాని రెడ్డి కారణంగా ముత్తిరెడ్డి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. నా సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
భారత రీసెర్చ్ అండ్ అనలసిస్ వింగ్ అధిపతిగా ఐపిఎస్ అధికారి రవి సిన్హాని నియమించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రా చీఫ్ సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత రవిసిన్హా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
బిపర్ జోయ్ తుఫాను రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాలను తాకడంతో ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా అజ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రిలోకి వరదనీరు చేరింది.ఆసుపత్రిలో నీరు నిలిచిపోవడంతో సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా సోమవారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బైడెన్ల ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 21 నుండి 23 వరకు యుఎస్‌లో పర్యటించనున్నారని క్వాత్రా పేర్కొన్నారు.