Home /Author anantharao b
పారిస్‌లోని సబర్బన్ ప్రాంతమైన నాంటెర్రేలో డెలివరీ డ్రైవర్‌ను ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి, ఈ నేపధ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా 400 మందిని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఒక పోలీసు అధికారికి నగదు కట్టలతో అతని కుటుంబం సెల్ఫీ తీసుకున్న తక్షణమే బదిలీ అయింది. అతని భార్య మరియు పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వారు రూ. 500 నోట్ల కట్టలతో పోజులివ్వడంతో అతనిపై విచారణ ప్రారంభించబడింది
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.ఢిల్లీ మెట్రోలో ప్రధాని దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు
త్వరలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం పగటిపూట విద్యుత్ ఛార్జీలు 20 శాతం వరకు తగ్గనున్నాయి. అయితే రాత్రిపూట పీక్ వేళల్లో విద్యుత్ ఛార్జీలను 20 శాతం మేర పెంచనున్నారు. దీనికి సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ మోదీకి వైట్ హౌస్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మొత్తం 400 మంది అతిథులను ఆహ్వానించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు
డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వెన్నెముక లేని సర్వెంట్ గా యోగేశ్వర్ దత్‌ని ప్రపంచం గుర్తుచేసుకుంటోందని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం అన్నారు, తనతో పాటు మరో ఐదుగురికి ఆసియా క్రీడలు మరియు ప్రపంచ పోటీల నుండి మినహాయింపు ఇవ్వడాన్ని దత్ ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
పాట్నాలో శుక్రవారం 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి నాయకులు సమావేశమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్‌కు చెందిన భగవంత్ మాన్, తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.
బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ) లో కోవిడ్-19 సమయంలో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.